ట్యూటర్ ను పెట్టుకున్న బన్ని

March 25, 2020


img

అల వైకుంఠపురములో సూపర్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా సుకుమార్ డైరక్షన్ లో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మరో రంగస్థలంలా ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. శేషాచలం అడవుల నేపథ్యంలో కథ నడుస్తుందట. సినిమాలో బన్ని చిత్తూరు యాస మాట్లాడుతాడట. అందుకోసం స్పెషల్ ట్యూటర్ ని పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈమధ్య స్టార్స్ తాము చేసే పాత్రల కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటున్నారు. అందులో భాగంగానే హీరో పాత్ర ఏ ప్రాతం వాడో అక్కడ యాసని నేర్చుకుంటున్నారు. 

బన్ని కూడా సుకుమార్ సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని మరిచిత్తూరు యాస ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో బన్ని లుక్ కూడా కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. లేటెస్ట్ గా బయటకు వచ్చిన బన్ని లుక్ చూస్తే గెడ్డం బాగా పెంచేసి కనిపించాడు. సినిమాలో హీరో పాత్ర లారీ డ్రైవర్ గా కనిపిస్తాడట. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2021 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. Related Post

సినిమా స‌మీక్ష