ఫరెవర్ యువర్స్ చిరు.. ట్విట్టర్ ఫస్ట్ ట్వీట్ ఏంటంటే..!

March 25, 2020


img

మెగాస్టార్ చిరంజీవి ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఏదైనా విషయం మీద తన స్పందన తెలియచేసేందుకు తన అభిమానులతో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లోకి అఫీషియల్ పేజీ క్రియేట్ చేసుకున్నారు. ఇన్ స్టాగ్రామ్ తో పాటుగా ట్విట్టర్ లో కూడా తన మొదటి మెసేజ్ పెట్టారు చిరు. డిపిగా ఫరెవర్ యువర్స్ చిరు అని ఇమేజ్ పెట్టిన మెగాస్టార్ ప్రస్తుతం దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుండి మనల్ని మనం కాపాడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 

ప్రభుత్వ సూచనల ప్రకారం ఎవరు బయటకు రాకుండా ఉండాలని.. 21 రోజుల లాక్ డౌన్ ను అందరు పాటించాలని సూచించారు చిరంజీవి. చిరు అలా ట్విట్టర్ లోకి వచ్చారో లేదో ఉగారి శుభాకాంక్షలు చెబుతూ నేరుగా అభిమానులతో మాట్లాడగలడం తనకు ఏంటో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు చిరు. అయితే సోషల్ మీడియాలో చిరు రావడం బాగున్నా ఇక్కడ ఎంత మంచి ఉందో అంట చెడు కూడా ఉంది ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడి కామెంట్ చేసే అవకాశం ఉంది. మరి ఆ నెగటివ్ కామెంట్స్ ను చిరు రిసీవ్ చేసుకుంటారా లేదా అన్నది చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష