నీరు నిప్పు కలిస్తే.. 'రౌద్రం రణం రుధిరం' మోషన్ పోస్టర్ అదిరింది..!

March 25, 2020


img

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా పూర్తి టైటిల్ ఉగాది సందర్భంగా ఈరోజు రిలీజ్ చేశారు. రౌద్రం రణం రుధిరం టైటిల్ తో రాబోతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ ఇద్దరు కలిస్ చేస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ సినిమా మోషన్ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఒంటి మీద నిప్పుతో అగ్నిపర్వతంగా దూసుకొచ్చే చరణ్ ఒకవైపు.. నీటితో తారక్ ఒకవైపు వస్తున్నారు. ఇద్దరు కలిసి చేసే రణం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడాల్సిందే. 

ఇక ఈ మోషన్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్ కూడా ఒక స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు. బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలిసేలా చేసిన జక్కన్న ఈ ట్రిపుల్ ఆర్ తో మరో సంచలనానికి సిద్ధమయ్యాడని చెప్పొచ్చు. మోషన్ పోస్టర్ చూసిన ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఉత్సాహంతో ఉన్నారు. 





Related Post

సినిమా స‌మీక్ష