సినీ నిర్మాత ఆత్మహత్య

March 24, 2020


img

కన్నడ సినీ నిర్మాత కపాలి మోహన్ సోమవారం రాత్రి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కన్నడ నిర్మాతగా సుపరిచితుడైన కపాలి మోహన్ కొన్నాళ్లుగా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారట. సినిమాల్లో లాస్ రావడంతో ఈమధ్య కొత్తగా హోటల్ బిజినెస్ నడిపిస్తున్నారు మోహన్. అయితే ఆ బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం.. ఓ పక్క అప్పులు ఎక్కువవడంతో ఆ ప్రెజర్ భరించలేక ఉరి వేసుకుని మరణించారు. 

తాను చనిపోతున్న విషయాన్ని ముందే వీడియో రికార్డ్ చేసి మరి మోహన్ మరణించడం జరిగింది. తన స్నేహితుడు మంజునాథ్ తో రాత్రి హోటల్ లో భోజనం చేసిన మోహన్ మంజునాథ్ బాగా నిద్రిస్తున్న టైం లో ఈ ఘోరం చేసుకున్నారు. సెల్ఫీ వీడియోలో తన చావుకు ఆర్ధిక సమస్యలే కారణమని చెప్పారు. తన కుటుంబాన్ని ఆదుకోవాలని కర్ణాటక సీఎంకు విజ్ఞప్తి చేశారు. Related Post

సినిమా స‌మీక్ష