ఆ డైరక్టర్ నన్ను మోసం చేశాడు..!

March 24, 2020


img

ఆరెక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ ఆ సినిమాతో యూత్ లో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకుంది. కార్తికేయ సరసన నటించిన పాయల్ ఒక్క సినిమాతోనే మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తో వరుస ఛాన్సులు అందుకుంది. ఆర్డీఎక్స్ లవ్ సినిమాలో కూడా హాట్ గా నటించిన పాయల్ సీత సినిమాలో స్పెషల్ సాంగ్ లో నర్తించింది. ఇక అదే కాకుండా విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ వెంకీమామలో కూడా అమ్మడు నటించింది. 

ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా నటించిన పాయల్ తనని ఆంటీలా చూపించారని ఫీల్ అవుతుంది. డైరక్టర్ తనని మోసం చేశాడని తన సన్నిహితుల దగ్గర చెప్పుకుందట పాయల్ రాజ్ పుత్. ఎఫ్-2 సినిమాలో తమన్నా కూడా వెంకటేష్ తో జోడీ కట్టింది. ఆ సినిమాలో తమన్నాని అందంగా చూపించారు. అయితే పాయల్ ను మాత్రం వెంకీమామ దర్శకుడదు కె.ఎస్ బాబీ ఆంటీలా చూపించాడని బాధపడుతుంది. ఆ సినిమా వల్ల తన ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని చెబుతుందట. Related Post

సినిమా స‌మీక్ష