అందులోనూ మెగాస్టార్ ఎంట్రీ..!

March 24, 2020


img

మెగాస్టార్ చిరంజీవి ఫైనల్ గా సోషల్ మీడియా ఎంట్రీ ఇస్తున్నారు. ఉగాది కానుకగా మెగా ఫ్యాన్స్ కు ఈ స్పెషల్ సర్ ప్రయిజ్ ఇస్తున్నారు చిరు. ఏదైనా విషయం మీద తన స్పందన తెలియచేయాలంటే ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది. లేదంటే వీడియో తీసి అది అందరికి పంపించాల్సి వస్తుంది. అందుకే సోషల్ మీడియాలో ఉంటే మనం ఉన్న చోట వీడియో చేసి అప్లోడ్ చేస్తే చాలు అది అందరికి చేరుతుంది. ఈమధ్య కరోనా పట్ల ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్, జనతా కర్ఫ్యూ విషయాల మీద చిరు తన స్పందన తెలియచేశారు.  

కరోనాను కట్టడి చేసేందుకు తమ వంతు కృషి చేయాలని. కేవలం ఇళ్లల్లో ఉండి వైరస్ ఎక్కువ స్ప్రెడ్ అవకుండా జాగ్రత్త పడాలని సూచించారు. అంతేకాదు కరోనా వ్యాధి సోకకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన వ్యక్తిగత జాగ్రత్తలను చిరు చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇస్తే మాత్రం ఇక ఆయన పెట్టే పోస్టులకు సూపర్ క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు. మెగా ఫ్యాన్స్ ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న ఈ తరుణం ఉగాది రోజున మొదలవుతుంది. ఈ విషయాన్ని ఒక వీడియో మెసేజ్ ద్వారా ఇచ్చిన చిరు ఉగాది రోజు తన ఫస్ట్ పోస్ట్ ఏం పెడతారో చూడాలి.   Related Post

సినిమా స‌మీక్ష