మా భూమి @ 40 ఇయర్స్

March 23, 2020


img

తెలుగు సినిమా చరిత్రలో మా భూమికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పొచ్చు. తెలంగాణా పల్లె జీవితాన్ని యాసను వెండితెరకు పరిచయం చేసిన సినిమా. గౌతమ్ ఘోష్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను బి నరసింగారావు. కిషన్ చందర్ రాసిన జబ్ ఖేత్ జాగే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాకు ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. కార్వే వారి ప్రపంచ చలనచిత్రోత్సవాల్లో మన దేశం తరపున అధికారికంగా ఎంపికయ్యేన్ది మా భూమి. అంతేకాదు సి.ఎన్.ఎన్- ఐబిఎన్ స్పెషల్ గా చేసిన 100 బెస్ట్ ఇండియన్ మూవీస్ లో మాభూమి స్థానం దక్కించుకుంది. 

ఈ సినిమా షూటింగ్ మొత్తం మెదక్ జిల్లా మంగళ్ పర్తిలో జరిగింది. నిర్మాత బి.నరసింగరావు అత్తగారి ఊరు అది. లక్షన్నర బడ్జెట్ తో మొదలు పెట్టిన ఈ సినిమాకు ఐదున్నర లక్షల బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన గౌతమ్ ఘోష్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అందించారు. ప్రజా గాయకుడు గద్దర్ తొలిసారి తెరమీద కనిపించినా సినిమా ఇదే. అంతేకాదు తెలంగాణా శకుంతల కూడా ఈ సినిమాతో తెరంగేట్రం చేశారు. 

ఈరోజుకి ఈ సినిమా రిలీజై 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చాలా కష్టాలు పడ్డారు దర్శక నిర్మాతలు. సెన్సార్ కు పంపించడానికి కూడా సినిమా సహా నిర్మాత రవీంద్ర నాథ్ పెళ్లి ఉంగరాలు తాకట్టు పెట్టి 700 రూపాయలతో సెన్సార్ చేయించారట. అయితే సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీని మార్చి 23న రిలీజ్ చేయడానికి కారణం భగత్‌ సింగ్, రాజగురు, సుఖదేవ్‌లను ఉరి తీసింది ఈరోజే.. వాళ్లకు నివాళిగా ఈ సినిమా రిలీజ్ చేశారు. ఈ సినిమాతో నవలా రచయిత త్రిపురనేని గోపీచంద్ తనయుడు సాయి చంద్ వెండితెరకు పరిచయమయ్యారు. చిల్లర దేవుళ్ళు సినిమా తర్వాత పూర్తిగా తెలంగాణా యాసలో వచ్చిన సినిమా ఇది.  

  


Related Post

సినిమా స‌మీక్ష