భీష్మ బాలీవుడ్ రీమేక్..!

March 23, 2020


img

నితిన్ హీరోగా వెంకీ కుడుములు డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా భీష్మ. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. తెలుగులో ఏదైనా సినిమా హిట్ అయితే వెంటనే రీమేక్ చేయాలని చూసే తమిళ, హిందీ పరిశ్రమ దర్శక నిర్మాతలు భీష్మ మీద కన్నేశారు. లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం భీష్మ బాలీవుడ్ రీమేక్ చర్చలు జరుగుతున్నాయట. కరణ్ జోహార్ ఈ రీమేక్ ను నిర్మిస్తారని తెలుస్తుంది. రణబీర్ కపూర్ తో భీష్మ హింది వర్షన్ చేస్తున్నారని తెలుస్తుంది. 

నితిన్ కెరియర్ లో భీష్మ మంచి హిట్ గా నిలిచింది. బాహుబలి తర్వాత తెలుగు సినిమాల మీద బాలీవుడ్ మేకర్స్ ఫోకస్ ఎక్కువైంది. లేటెస్ట్ హిట్ భీష్మ మీద కూడా వారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం పూరి డైరక్షన్ లో వస్తున్నా విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమాను కూడా హిందీలో రిలీజ్ చేస్తున్నాడు కరణ్ జోహార్. చూస్తుంటే కరణ్ తెలుగు డైరెక్ట్ సినిమాలు కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. Related Post

సినిమా స‌మీక్ష