పేద కళాకారులకు అండగా..!

March 23, 2020


img

కరోనా వైరస్ వల్ల తెలుగు రెండు రాష్ట్రాల్లో మార్చ్ 31 వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన జనతా కర్ఫ్యూ సక్సెస్ అవగా మార్చ్ 31 వరకు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. ఇక కరోనా తీవ్రతను ముందే పసిగట్టిన తెలంగాణా ముఖ్యమంత్రి కె.సి.ఆర్ నిత్యావసరాలకు ఇబ్బంది పడకుండా మిగతా వాటినన్నిటిని క్లోజ్ చేయాలని ఆర్డర్ పాస్ చేశారు. అయితే సినిమా పరిశ్రమ కూడా స్వచ్చంధంగా తమ షూటింగులను క్యాన్సిల్ చేసుకుంది. వైరస్ తీవ్రత తగ్గే వరకు షూటింగులు జరిగే అవకాశం లేదు. 

ఓ పక్క కర్ఫ్యూ మరోపక్క షూటింగులు బంద్ కావడంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోని నిరుపేద కళాకారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే వారి కష్టాన్ని గుర్తించిన జీవిత రాజశేఖర్ లు పేద నటీనటులకు పదిరోజులకు సరిపడా నిత్యావసరాలను అందిస్తున్నారు. కళాకారులు తమ వివరాలను 9010810140 నవీన్ వర్మకు ఫోన్ చేసి వివరాలు చెప్పాలని అన్నారు. రాజశేఖర్ దంపతులు చేస్తున్న ఈ మంచి పనికి నెటిజెన్ల ప్రశంసల వర్షం కురిపించారు. Related Post

సినిమా స‌మీక్ష