మెగా బ్రదర్స్ మల్టీస్టారర్.. ఆ రీమేక్ కు సై..!

March 21, 2020


img

టైటిల్ చూసి మెగా బ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ మూవీ గురించి అనుకోవచ్చు. ఈ మెగా మల్టీస్టారర్ సినిమాకు ముహూర్తం బయటపడలేదు. త్రివిక్రమ్ డైరక్షన్ లో మెగా పవర్ మల్టీస్టారర్ ఉంటుందని ఎనౌన్స్ చేసిన సుబ్బిరామిరెడ్డి సైలెంట్ అయ్యాడు. అయితే ఇక్కడ ప్రస్తావించింది తెలుగు మెగా బ్రదర్స్ గురించి కాదు కోలీవుడ్ బ్రదర్స్ గురించి అన్నమాట. 

తమిళంలో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న సూర్య, కార్తీలు ఇద్దరు కలిసి ఒక సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నారు. సరైన సబ్జెక్ట్ దొరికితే వాళ్లు చేసేందుకు సై అంటున్నారు. ఇక లేటెస్ట్ గా వీరి మల్టీస్టారర్ కు కథ దొరికిందని తెలుస్తుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనం కోసియం  సినిమా రీమేక్ లో సూర్య, కార్తీ నటిస్తున్నారట. పృథ్వి రాజ్, బిజూ మీనన్ పాత్రల్లో అన్నదమ్ములు నటిస్తున్నారు. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్నది తెలియాల్సి ఉంది. తమిళంలో కతిరేషన్ నిర్మిస్తున్న ఈ సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో చేస్తారట. ఈ సినిమాలో హీరోయిన్స్ మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష