నిర్భయ దోషుల ఉరిపై మహేష్ కామెంట్..!

March 20, 2020


img

చాలా రోజులుగా ఎదురుచూస్తున్నా.. ఫైనల్ గా న్యాయం జరిగింది. నిర్భయ తీర్పు న్యాయ వ్యవస్థపై మన విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుంది. ఈరోజు నిర్భయ దోషులకు ఉరి వేసిన తర్వాత ఆ విషయం తెలుసుకున్న మహేష్ పై విధంగా ట్వీట్ చేశారు. మహేష్ మాత్రమే కాదు నిర్భయకు జరిగిన అన్యాయానికి తగిన తీర్పు లభించిందని సినీ సెలబ్రిటీస్ తమ సోషల్ బ్లాగ్స్ ద్వారా స్పందించారు. 

బయట జరుగుతున్నా విషయాల మీద తన స్పందన తెలియచేయడంతో ఎప్పుడు ముందు ఉండే మహేష్ నిర్భయ దోషులకు ఉరి వేశారన్న వార్త తనకు తెలియగానే తన స్పందంగా ట్వీట్ చేశారు. ఈ ఇయర్ మొదట్లో సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ చేయాల్సి ఉంది. అసలైతే వంశీ పైడిపల్లితో మూవీ చేయాల్సి ఉన్నా కథ విషయంలో తేడా రావడంతో పరశురామ్ కు మహేష్ ఓకే చెప్పాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.  

Related Post

సినిమా స‌మీక్ష