నానితో రష్మిక.. లక్కు మాములుగా లేదు..!

February 25, 2020


img

కన్నడ భామ రష్మిక మందన్న వరుస సక్సెస్ లతో దూసుకెళ్తుంది. ఈ ఇయర్ ఆల్రెడీ సరిలేరు నీకెవ్వరు, భీష్మ రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్లు పడ్డాయి. ఇక లేటెస్ట్ గా త్రివిక్రం, తారక్ సినిమా.. సుకుమార్, అల్ల్ అర్జున్ సినిమాలో కూడా ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా నాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న శ్యాం సింగ రాయ్ మూవీ సెట్స్ మీదకు వెళ్తుంది.

టాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యన్ చెప్పిన కథకు ఫిదా అయిన నాని ఈ సినిమా చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టరే సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. నానితో రష్మిక ఆల్రెడీ దేవదాస్ సినిమాలో నటించారు. మళ్లీ ఈ జోడీ కలిసి అలరించనున్నారు. తనకు ఇచ్చిన ఏ పాత్ర అయినా బాగా చేస్తున్న రష్మిక తెలుగులో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది.



Related Post

సినిమా స‌మీక్ష