ఆహా కోసం సమంత..!

February 25, 2020


img

పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా సూపర్ ఫాంలో ఉన్న సమంత ప్రస్తుతం సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ ల మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అమేజాన్ ప్రైం ఫ్యామిలీ మ్యాన్ సీక్వల్ లో నటిస్తున్న సమంత ఆ వెబ్ సీరీస్ లో నెగటివ్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా అల్లు అరవింద్ ఆహా ఓటిటి యాప్ మొదలు పెట్టారు. డిజిటల్ మీడియాలో సరికొత్త సంచలనంగా ఆహా మారనుంది.      

ఆహా కోసం ఇప్పటికే చాలా వెబ్ సీరీస్ లను కొనేయగా లేటెస్ట్ గా సమంతను నెల రోజుల పాటుగా బల్క్ డేట్స్ అడిగారట. సమంతతో ఓ వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సమంతకు ఎలాంటి డిమాండ్ ఉంది కాబట్టి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఆమెను పెట్టుకున్నారట. ఫ్యామిలీ మ్యాన్ తో మొదటి వెబ్ సీరీస్ చేస్తున్న సమంత ఆహా కోసం ఎలాంట్ క్రేజీ వెబ్ సీరీస్ లను చేస్తుందో చూడాలి.     



Related Post

సినిమా స‌మీక్ష