భీష్మ డైరక్టర్ భలే ఛాన్స్

February 25, 2020


img

ఛలోతో మొదటి సినిమా సక్సెస్ అందుకున్న వెంకీ కుడుముల తన సెకండ్ ప్రాజెక్ట్ భీష్మతో కూడా సూపర్ హిట్ అందుకున్నాడు. ఈమధ్య సరైన హిట్ లేక కెరియర్ కన్ ఫ్యూజన్ లో ఉన్న నితిన్ కు సరైన టైంలో సరైన హిట్ ఇచ్చాడు వెంకీ. ఇండస్ట్రీలో హిట్ వచ్చింది అంటే అవకాశాలు వచ్చినట్టే. రెండు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ అందుకున్న వెంకీ కుడుములకు వరుస అవకాశాలు వస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌసెస్ నుండి అతనికి కాల్స్ వస్తున్నాయట. అడ్వాన్సులు కూడా భారీగానే వస్తున్నాయన్ని తెలుస్తుంది. 

ఈ క్రమంలో సితారతో వెంకీ మరో సినిమా కమిట్మెంట్ ఉందట. ఇది కాకుండానే యువి క్రియేషన్స్ వారు వెంకీకి అడ్వాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. యువ హీరోలతో వెంకీ చేస్తున్న క్రేజీ లవ్ స్టోరీస్ ఆడియెన్స్ కు కావాల్సిన ఎంటర్టైనింగ్ అందిస్తున్నాయి. మొదటి సినిమా ఏదో లక్కీ అనుకున్నా భీష్మతో హిట్ కొట్టి తనకంటూ ఓ మార్క్ వేసుకున్నాడు ఈ డైరక్టర్. మరి ఈ డైరక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తాడో త్వరలో తెలుస్తుంది.  



Related Post

సినిమా స‌మీక్ష