తెలుగు అంధాధున్ మొదలైంది

February 24, 2020


img

భీష్మ హిట్ తో మంచి జోష్ లో ఉన్న నితిన్ ఇప్పటికే రెండు సినిమాలు సెట్స్ మీదకు రావాల్సి ఉండగా మరో సినిమా లైన్ లో పెట్టాడు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అంధాధున్ రీమేక్ గా నితిన్ సినిమా మొదలుపెట్టాడు. మేర్లపాక గాంధి డైరక్షన్ లో ఈ రీమేక్ తెరకెక్కుతుంది. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈరోజు ముహుర్త కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది.     

బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవడమే కాదు నేషనల్ అవార్డ్ సైతం తెచ్చిపెట్టింది. అంధాధున్ రీమేక్ కు నితిన్ పర్ఫెక్ట్ అని భావించిన సుధాకర్ రెడ్డి ఆ సినిమా హక్కులను కొనేశారు. కృష్ణార్జున యుద్ధం తర్వాత మేర్లపాక గాంధి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తుందో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష