చిరంజీవి సినిమాలో మహేష్..?

February 24, 2020


img

కొరటాల శివ డైరక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా నుండి లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే చిరు లుక్ లీకై సినిమాపై అంచనాలు పెంచగా లేటెస్ట్ గా చిరు సినిమాలో గెస్ట్ రోల్ లో సూపర్ స్టార్ మహేష్ కూడా నటిస్తాడని తెలుస్తుంది. కొరటాల శివ సినిమాతో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు చేసిన మహేష్ ఆ డైరక్టర్ అడగాలే కాని కాదని చెప్పడు.

లేటెస్ట్ గా చిరు సినిమాలో మహేష్ కూడా ఉంటాడన్న వార్త బయటకు వచ్చింది. అదే నిజమైతే మాత్రం చిరు, మహేష్ లను చూసేందుకు మెగా ఘట్టమనేని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు. అసలైతే ఈ సినిమాలో చరణ్ యంగ్ ఏజ్ చిరు పాత్రలో నటిస్తాడని వార్తలు వచ్చాయి. మరి చిరు 152లో అసలు సర్ ప్రైజ్ ఏంటి.. సినిమాలో చిరుతో పాటుగా చరణ్ ఉంటాడా.. మహేష్ కనిపిస్తాడా అన్నది తెలియాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.



Related Post

సినిమా స‌మీక్ష