నాని 'శ్యామ్ సింగ రాయ్'

February 24, 2020


img

నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో సినిమా ఎనౌన్స్ మెంట్ జరిగింది. సితార ఎంటర్టర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్యామ్ సింగ రాయ్ అనే టైటిల్ ఖరారు చేశారు. సినిమా ఎనౌన్స్ చేయడమే టైటిల్ తో ఎనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. ఈరోజు నాని బర్త్ డే కానుకగా నాని శ్యామ్ సింగ రాయ్ పోస్టర్ రిలీజ్ చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా పోస్టర్ తోనే ఇదో కొత్త ప్రయత్నమని చెప్పకనే చెప్పారు.

ప్రస్తుతం నాని 'V' సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా మార్చి 27న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో పాటుగా శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా కొత్తగా రాహుల్ డైరక్షన్ లో శ్యామ్ సింగ రాయ్ ఎనౌన్స్ చేశాడు నాని. టాక్సీవాలా సినిమాతో కొత్తగా ప్రయత్నించిన రాహుల్ నాని సినిమాతో కూడా అదరగొడతాడని చెప్పొచ్చు. మరి ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.  



Related Post

సినిమా స‌మీక్ష