తేజ డైరక్షన్ లో RRR..?

February 22, 2020


img

అదేంటి RRR మూవీ చేస్తుంది రాజమౌళి కదా సడెన్ గా రాజమౌళి ప్లేస్ లో తేజ ఎలా వస్తాడు. అయినా రాం చరణ్, ఎన్.టి.ఆర్ లను హ్యాండిల్ చేసే సత్తా తేజాకి ఉందా ఇలాంటి డౌట్స్ అన్ని టైటిల్ చూడగానే వచ్చేస్తాయి. RRR టైటిల్ కు ఉన్న పవర్ అలాంటిది తప్పులేదు. కాని ఈ RRR కు రాజమౌళి తీస్తున్న RRR కు ఎలాంటి సంబంధం లేదు. బాహుబలి తర్వాత జక్కన్న చెక్కుతున్న మరో అద్భుతమ కళాకండం RRR. 

అయితే ఈ RRR కు తేజ RRR కు ఏమాత్రం సంబంధం లేదు. నేనే రాజు నేనే మంత్రి హిట్ అయిన తర్వాత కాజల్ మీద చాలా హోప్స్ పెట్టుకుని సీత సినిమా చేశాడు తేజ. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అందుకే కొద్దిపాటి గ్యాప్ తో ఒకేసారి రెండు సినిమాలను ఎనౌన్స్ చేశాడు తేజ. అందులో ఒకటి అలిమేలుమంగ వేంకటరమణ కాగా.. మరోటి రాక్షస రాజు రావణాసురుడు. ఈ సెకండ్ టైటిల్ ను షార్ట్ కట్ చేస్తే ఆర్.ఆర్.ఆర్ అని పిలవాల్సిందే. అంటే RRR కు వచ్చిన క్రేజ్ ను రాక్షస రాజు రావణాసురుడుకి వాడుకోవాలని చూస్తున్నాడు తేజ. రానా, గోపిచంద్ ఈ ఇద్దరిలో ఈ సినిమా హీరో ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.  



Related Post

సినిమా స‌మీక్ష