అనీల్ తో రాం చరణ్.. ఎట్టేట్టా..?

February 22, 2020


img

సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు అంటూ సెన్సేషనల్ హిట్ అందుకున్న అనీల్ రావిపుడి అసలైతే ఎఫ్2 సీక్వల్ గా ఎఫ్3 కథ మీద కూర్చున్నాడని అంటున్నారు. కాని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం అతను మెగా పవర్ స్టార్ రాం చరణ్ కు కథ వినిపించే పనిలో ఉన్నాడట. చరణ్ కోసం ఓ అద్భుతమైన కథ రాసుకున్నాడత అనీల్. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న చరణ్ అనీల్ కథ వినేందుకు త్వరలో డేట్ ఫిక్స్ చేస్తారట.

అనీల్ చెప్పిన కథ నచ్చితే మాత్రం చరణ్ నో చెప్పడానికి రీజన్స్ ఏమి ఉండవు. ఎందుకంటే మహేష్ తో సరిలేరు నీకెవ్వరు హిట్ అందుకున్నాడు కాబట్టి అనీల్ మీద స్టార్ హీరోలు నమ్మకం పెట్టుకోవచ్చు. ప్రేక్షకుల నాడి తెలుసుకున్న అనీల్ రావిపుడికి కొన్నాళ్ల వరకైతే తిరుగు ఉండదని సిని విశ్లేషకులు చెబుతున్నారు. మరి రాం చరణ్ అనీల్ రావిపుడికి ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష