అనసూయ ఏమాత్రం తగ్గట్లేదుగా..!

February 22, 2020


img

యాంకర్ గా సూపర్ ఫాం లో ఉన్న అనసూయ ఈమధ్య సినిమాల్లోనూ బిజీ అవుతుంది. స్మాల్ అండ్ సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుతున్న ఈ అమ్మడు ఖాళీ టైం కూడా ఉంటుందని ఎవరు అనుకోరు. అయితే తనకు ఉన్న టైం లోనే తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కోసం అనసూయ ఫోటో షూట్స్ చేస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే ఈ ఫోటో షూట్స్ వల్లే అనసూయకు ఈ విధమైన క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు. జబర్దస్త్ షోలో కామెడీతో పాటుగా అనసూయ అందాలను ఆస్వాధిస్తారు ఆడియెన్స్.

ఇక అనసూయ లేటెస్ట్ గా ఓ క్రేజీ ఫోటో షూట్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్లాక్ డ్రెస్ లో హొయలు పోతున్న అనసూయ అందాల విందుని ప్రతి ఒక్కరు ఆస్వాధించాల్సిందే. యాంకర్ కు కొత్త అర్ధం చెప్పిన ఈ క్రేజీ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ పై మాత్రం కొత్తగా ప్రయత్నిస్తుంది. సుకుమార్ బన్ని సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్న అనసూయ విజయ్ దేవరకొండ సెకండ్ ప్రొడక్షన్ లో కూడా కీ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష