చిరు 152 లుక్ లీక్..!

February 22, 2020


img

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా కొరటాల శివ డైరక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రాం చరణ్ తో పాటుగా మ్యాట్నీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తారని తెలుస్తుంది. ఈ మూవీలో చిరు డ్యుయల్ రోల్ లో నటిస్తారని అంటున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కోకాపేట్ లో జరుగుతుంది.

లేటెస్ట్ గా సినిమా షూటింగ్ స్పాట్ నుండి చిరు లుక్ ఒకటి లీక్ అయ్యింది. చిరు నక్సలైట్ గా కనిపిస్తున్న ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ మూవీలో చిరంజీవి డ్యుయల్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. అంతేకాదు యంగ్ ఏజ్ రోల్ లో రాం చరణ్ కూడా కనిపిస్తాడని టాక్. మెగా ఫ్యాన్స్ కు కావాల్సిన సర్ ప్రైజులతో మెగాస్టార్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ. చూస్తుంటే ఈ దసరాకి మెగా ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఇచ్చేలా ఉన్నారు.  



Related Post

సినిమా స‌మీక్ష