స్వీటీ అనుష్క రెమ్యునరేషన్.. టాప్ లేపేస్తుంది

February 22, 2020


img

సౌత్ లో నంబర్ 1 స్టార్ హీరోయిన్ రేసులో మొదటి రెండు స్థానాల్లో ఉండే అనుష్క సెలెక్టెడ్ సినిమాల్లో నటిస్తుంది. బాహుబలి తర్వాత భాగమతి సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం నిశ్శబ్దం సినిమాలో నటిస్తుంది. కోనా ఫిల్మ్ కార్పొరేషన్ లో కోనా వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమాను హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేశారు. సినిమాలో అనుష్క డెఫ్ అండ్ డమ్ పాత్రలో నటిస్తుంది. 

ఈ సినిమాకు గాను అనుష్క 2.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సౌత్ లో నయనతారకు సరిసమానంగా అనుష్క రెమ్యునరేషన్ ఉంది. నిశ్శబ్దం హిట్ అయితే మాత్రం అనుష్క మళ్ళీ తన రెమ్యునరేషన్ పెంచాలని చూస్తుంది. మీడియం రేంజ్ హీరోలు కూడా ఐదారు కోట్లు పారితోషికం తీసుకుంటుంటే అనుష్క ఆ మాత్రం డిమాండ్ చేయడంలో తప్పేమి లేదని చెప్పొచ్చు. నిశ్శబ్దం తర్వాత అనుష్క మరో రెండు సినిమాలు డిస్కర్షన్ స్టేజ్ లో ఉన్నాయి.


Related Post

సినిమా స‌మీక్ష