F3లో మహేష్ బాబు..?

February 22, 2020


img

సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు తర్వాత వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా గురించి అఫీషియల్ న్యూస్ ఇంకా బయటకు రాలేదు. అయితే లేటెస్ట్ గా మహేష్ మరోసారి అనీల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఆల్రెడీ ఇద్దరు కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమా చేశారు కదా అనుకోవచ్చు. మళ్ళీ మహేష్ అనీల్ డైరెక్షన్ లో వర్క్ చేయాలని అనుకుంటున్నాడు. అనీల్ సూపర్ హిట్ మూవీ f2 సీక్వల్ గా ఒక సినిమా రాబోతుందని తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమానే అనీల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ తో పాటుగా మొన్నటిదాకా మాస్ మహారాజ్ రవితేజ కూడా నటిస్తాడని అన్నారు. కాని ఈ ప్రాజెక్ట్ లోకి అనూహ్యంగా మహేష్ వచ్చాడు. 

సరిలేరు హిట్ తో అనీల్ తో మంచి ర్యాపో ఏర్పడగా f3లో రవితేజని తప్పించి క్యారక్టర్ కొద్దిగా మార్చి మహేష్ తో చేయించాలని చూస్తున్నారట. అదే జరిగితే ఓకే సినిమాలో ముగ్గురు స్టార్స్ ను చూసేయొచ్చు. f3 లో వెంకటేష్, వరుణ్ తేజ్ లది ఫుల్ లెంగ్త్ రోల్ కాగా మహేష్ ది చాలా చిన్న రోల్ అని తెలుస్తుంది.


Related Post

సినిమా స‌మీక్ష