క్రాక్ టీజర్.. రవితేజ ఫామ్ లోకి వచ్చేలా ఉన్నాడు..!

February 21, 2020


img

వరుస ఫ్లాపులతో కెరియర్ ఏమాత్రం బాగాలేని మాస్ మహరాజ్ రవితేజ అర్జెంట్ గా ఓ పవర్ ఫుల్ హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజా ది గ్రేట్ తర్వాత చేసిన నాలుగు సినిమాలు దారుణంగా పోయాయి. రీసెంట్ గా వచ్చిన డిస్కో రాజా రిలీజ్ ముందు హడావిడి బాగానే చేసినా ఆఫ్టర్ రిలీజ్ సీన్ అర్ధమైపోయింది. అందుకే తనకు డాన్ శీను, బలుపు లాంటి రెండు హిట్ సినిమాలు ఇచ్చిన గోపిచంద్ మలినేనితో రవితేజ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాకు క్రాక్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కిక్ తర్వాత అంత వెరైటీగా అనిపించిన రవితేజ సినిమా టైటిల్ ఇదే అని చెప్పొచ్చు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ చూస్తే క్రాక్ తో రవితేజ పక్కా హిట్టు కొట్టడం గ్యారెంటీ అనేలా ఉంది. మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రవితేజని మళ్లీ క్రాక్ ఫాంలోకి తెస్తుందో లేదో చూడాలి. 

Related Post

సినిమా స‌మీక్ష