నీ కృష్ణలీలలు ఆపవా పవన్ కళ్యాణా..?

February 21, 2020


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ తిరిగి సినిమాల్లో బిజీ అవుతున్నారు. ఇప్పటికే పింక్ రీమేక్ షూటింగ్ లో జరుపుకుంటున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే క్రిష్ డైరక్షన్ లో మూవీ ముహుర్తం పెట్టారు. ఇదే కాకుండా గబ్బర్ సింగ్ డైరక్టర్ హరీష్ శంకర్ కు ఒక మూవీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వీటితో పాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్నేహితుడు త్రివిక్రం తో కూడా ఒక సినిమా ఉంటుందని తెలుస్తుంది.

అయితే వీరితో పాటుగా గోపాల గోపాల డైరక్టర్ పార్ధ సారధి అలియాస్ డాలి డైరక్షన్ లో పవన్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా కూడా గోపాల గోపాల సీక్వల్ అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ మరోసారి తన కృష్ణ లీలలు చూపించనున్నాడు. వరుసగా సినిమా ప్లానింగ్స్ చేస్తున్నా ఇవన్ని చేసేందుకు మాత్రం పవన్ చాలా టైం పట్టేలా ఉంది.   Related Post

సినిమా స‌మీక్ష