ఆ హీరోయిన్ను వదలవా త్రివిక్రం

February 21, 2020


img

మాటల మాంత్రికుడు త్రివిక్రం అల వైకుంఠపురములో తర్వాత చేస్తున్న సినిమా ఎన్.టి.ఆర్ తో ఫిక్స్ చేసుకున్నాడు. ఈమధ్యనే అఫిషియల్ గా ఎనౌన్స్ చేసిన ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ లో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్నారు. ఈ మూవీ కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్నట్టు తెలుస్తుంది. అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ పరిశీలణలో ఉంది.    

ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ తో త్రివిక్రం చేసిన అరవింద సమేత సినిమాలో పూజా హెగ్దే ఆ సినిమాతో హిట్ అందుకుంది. ఇక రీసెంట్ గా వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో కూడా అమ్మడు అదిరిపోయే హిట్ అందుకుంది. తారక్ తో నెక్స్ట్ సినిమా కోసం పూజాని సెలెక్ట్ చేశాడట త్రివిక్రం. ముచ్చటగా మూడో సినిమాకు ఆమెను తీసుకున్నాడు త్రివిక్రం. అల వైకుంఠపురములో సినిమా ప్రమోషన్స్ లో కూడా పూజా హెగ్దే హార్డ్ వర్క్ కు తాను ఫిదా అయినట్టు చాలా సందర్భాల్లో చెప్పాడు త్రివిక్రం.Related Post

సినిమా స‌మీక్ష