నితిన్ పవర్ పేట విశేషాలు

February 20, 2020


img

యువ హీరో నితిన్ తన సినిమాల వేగం పెంచాడని తెలుస్తుంది. ఈ శుక్రవారం భీష్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నితిన్ ఈ సినిమా తర్వాత వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చంద్రశేఖర్ ఏలేటి సినిమా కూడా ఉంది. ఇవి కాలేదు అన్నట్టు కృష్ణ చైతన్య డైరక్షన్ లో నితిన్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. కొన్నాళ్లుగా దీనిపై వార్తలు వచ్చినా ఇప్పుడు అది కన్ ఫాం అయ్యింది.

నితిన్ పవర్ పేట టైటిల్ తో ఆ సినిమా తెరకెక్కుతుందట. సినిమా ఒక పార్ట్ లో కాకుండా మూడు పార్టుల్లో తెరకెక్కిస్తారని తెలుస్తుంది. 18 ఏళ్ల కుర్రాడు.. 30 ఏళ్ల వ్యక్తి.. 60 ఏళ్ల ముసలోడుగా నితిన్ కనిపిస్తాడట. ఈ సినిమాను మొత్తం మూడు పాత్రల్లో నితిన్ కనిపిస్తాడట. సినిమా మొదలు పెట్టడమే మూడు పార్టులు ఉంటాయని తెలుస్తుంది.  Related Post

సినిమా స‌మీక్ష