ఇండియన్-2 షూటింగ్ లో క్రేన్ యాక్సిడెంట్.. ముగ్గురు మృతి..!

February 20, 2020


img

శంకర్ డైరక్షన్ లో సూపర్ హిట్ మూవీ భారతీయుడు సినిమాకు సీక్వల్ గా ఇండియన్ 2 మూవీ సెట్స్ మీద ఉంది. ఈ సినిమా షూటింగ్ టైంలో బుధవారం రాత్రి 150 అడుగుల ఎత్తు నుండి క్రేన్ తెగి కిందపడ్డది. అయితే ఆ క్రేన్ పడటం పడటమే కొంతమంది చిత్రయూనిట్ మీద పడటంతో.. ఈ ఘటనలో శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు (29), అసిస్టెంట్ డైరక్టర్ సాయి కృష్ణ (34), మరో అసిస్టెంట్ చంద్రన్ మృతి చెందారు.      

వీరే కాకుండా మరో పది మందికి గాయాలైనట్టు సమాచారం. డైరక్టర్ శంకర్ కు కూడా కాలికి బలమైన గాయమైందని తెలుస్తుంది. ఈ సంఘటన కోలీవుడ్ సిని పరిశ్రమను షాక్ కు గురి చేసింది. కమల్ హాసన్ బాధితుల కుటుంబాలకు తన ప్రగాడ సానుభూతి ప్రకటించారు. కోటి రూపాయల ఆర్ధిక సాయం అందిస్తానని అన్నారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని కూడా అన్నారు కమల్ హాసన్. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే సిని కార్మికుల జీవితాల గురించి బాధవేస్తుందని అన్నారు. నేషనల్ వైడ్ గా ఈ ఘటనపై అందరు షాక్ అవుతున్నారు.    Related Post

సినిమా స‌మీక్ష