రష్మిక కుక్క బిక్సెట్లు.. ఇదో పెద్ద సెన్సేషన్ అయ్యిందే..!

February 19, 2020


img

కన్నడ భామ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగులో సూపర్ ఫాంలో ఉన్న హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. కన్నడ కిరాక్ పార్టీతో ఓవర్ నైట్ స్టార్ అయిన రష్మిక తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ అవడంతో విజయ్ దేవరకొండతో గీతా గోవిందం చేసింది. అది ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న రష్మిక ఈ శుక్రవారం భీష్మతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.       

నితిన్ సరసన రష్మిక నటించిన ఈ సినిమాను వెంకీ కుడుముల డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో రష్మిక కుక్క బిస్కెట్లు తింటుందని నితిన్ చెప్పడం బాగా వైరల్ అయ్యింది. రీసెంట్ గా జరిగిన భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా రష్మిక చాలా హార్డ్ వర్కర్ అయితే తన గ్లామర్ రహస్యం ఏంటి.. తను ఏం తింటుంది అన్న విషయాలు మాత్రం తనని అడగొద్దని అన్నాడు. అంతకుముందే బ్రహ్మాజి రష్మిక కుక్క బిస్కెట్లు తింటుందన్న విషయాన్ని ఇంకాస్త గట్టిగా చెప్పాడు. ఇంతకీ రష్మిక కుక్క బిస్కెట్లు తింటుందా లేదా సినిమా ప్రమోషన్ కోసమని ఇలా చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. 

హీరోయిన్ గా రెండు చేతులా సంపాదిస్తున్న రష్మికకు కుక్క బిస్కెట్లు తినాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. నితిన్ కావాలని రష్మిక గురించి అలా చెప్పి ఉండొచ్చని అంటున్నారు. ఇక ఈ సినిమాతో నితిన్, రష్మికల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడినట్టు ఉంది. నువ్వు నన్ను భరించాలి.. నేను నిన్ను భరిస్తా ఇద్దరిని నా భార్య షాలిని భరిస్తుందని సభాముఖంగా నితిన్ చెప్పడం చూస్తుంటే నితిన్, రష్మికలు మంచి స్నేహితులయ్యారని తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష