రామానాయుడు స్టూడియో మూతపడుతుందా..?

February 19, 2020


img

మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు సిని పరిశ్రమ అభివృద్ధి కోసం అప్పటి ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ లో రెండు స్టూడియోలను కట్టించారు. అందులో ఒకటి ఫిల్మ్ నగర్ లో ఉండగా.. మరోటి నానక్ రామ్ గూడలో ఉంది. అయితే నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోని కూల్చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సురేష్ బాబు ఆ స్టూడియోని కూల్చేసి మీనాక్షి కన్ స్ట్రక్షన్స్ అండ్ డెవెలప్మెంట్ కోసం ఇచ్చేస్తారని అంటున్నారు. 

నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోలో కూడా సినిమాల షూటింగ్ జరుపుకుంటారు. కొన్నాళ్లుగా అక్కడ స్టూడియోలో షూటింగ్ చేయనివ్వడం లేదని తెలుస్తుంది. ఆల్రెడీ కన్ స్ట్రక్షన్ కంపెనీతో సురేష్ బాబు డీల్ క్లోజ్ అయ్యిందని నేడో రేపో అక్కడ భవనాలను కూల్చేస్తారని తెలుస్తుంది. మరి ఈ వార్తలపై సురేష్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష