అనసూయలో విలన్ను చూస్తున్నారు

February 18, 2020


img

యాంకర్ గా బుల్లితెరను ఏలేస్తున్న అనసూయ ఈటివి, మాటివి, జీ టివి అనే తేడా లేకుండా ఫుల్ ఫాంలో ఉంది. అనసూయ షో చేస్తే అది సూపర్ హిట్ అనేలా ఆమె క్రేజ్ సంపాదించుకుంది. కేవలం బుల్లితెర మీదనే కాదు సిల్వర్ స్క్రీన్ పై కూడా అనసూయ తన సత్తా చాటుతుంది. క్షణం సినిమా నుండి తరుణ్ భాస్కర్ హీరోగా చేసిన మీకు మాత్రమే చెప్తా సినిమా వరకు వచ్చిన ఛాన్స్ ను వాడేసుకుంటుంది అనసూయ.  

స్మాల్ స్క్రీన్ పై గ్లామర్ గా కనిపించే అనసూయ సిల్వర్ స్క్రీన్ పై మాత్రం ప్రత్యేకమైన పాత్రల్లో కనిపిస్తుంది. ఇక లేటెస్ట్ గా మళ్లీ అలాంటి పాత్రనే ఫైనల్ చేసిందని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ నిర్మాతగా చేస్తున్న మరో సినిమాలో కూడా అనసూయకు ఛాన్స్ ఇస్తున్నాడట. ఈ సినిమాలో అనసూయ విలన్ గా నటిస్తుందని తెలుస్తుంది. మరి అనసూయలో విలన్ ఎలా కనిపించిందో ఏమో కాని అనసూయ మాత్రం ఈ పాత్రపై చాలా ఎక్సయిటింగ్ గా ఉంది.Related Post

సినిమా స‌మీక్ష