వెంకటేష్ చరణ్ కాంబో మూవీ..!

February 18, 2020


img

కేవలం హీరోగానే కాదు నిర్మాతగా కూడా రాం చరణ్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ ఇప్పటికే ఖైది నంబర్ 150, సైరా సినిమాలు నిర్మించిన చరణ్ ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో చిరు హీరోగా చేస్తున్న సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలే కాకుండా మళయాళ సినిమా లూసిఫర్, డ్రైవింగ్ లైసెన్స్ సినిమా రీమేక్ హక్కులను పొందినట్టు తెలుస్తుంది.

ఈ సినిమాల్లో ఒకదానిలో విక్టరీ వెంకటేష్ నటిస్తాడని టాక్. చిరుతో సమానంగా ఇమేజ్ తెచ్చుకున్న సీనియర్ హీరో వెంకటేష్ ను హీరోగా పెట్టి చరణ్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. అయితే వెంకీతో చరణ్ చేసే సినిమా లూసిఫర్, డ్రైవింగ్ లైన్సెన్స్ ఈ రెండిటిలో ఏదై ఉంటుందో తెలియాల్సి ఉంది. కొరటాల శివ, చిరు సినిమా పూర్తి కాగానే చరణ్ నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ చేస్తాడని తెలుస్తుంది.  Related Post

సినిమా స‌మీక్ష