చిరంజీవి మొదటి సినిమా దర్శకుడు మృతి

February 15, 2020


img

మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి సినిమా పునాదిరాళ్లు. ఆ సినిమాను డైరెక్ట్ చేసిన గుడిపాటి రాజ్ కుమార్ శనివారం తుది శ్వాస విడిచారు. రాజ్ కుమార్ మృతి పట్ల చిరంజీవి తన సంతాపాన్ని తెలియచేశారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకుంటున్న టైంలో రాజ్ కుమార్ తనని కలిసి పునాదిరాళ్లు కథ చెప్పారని.. ఇంకా శిక్షణ పూర్తి కాలేదని చెప్పినా తనని ఆ సినిమాలో తీసుకున్నారని. ఆయన బలవంతం మీదనే ఆ సినిమా చేశాను. తన జీవితానికి ఉనారిరాళ్లు వేసింది ఆయనే.

కొన్నాళ్ల క్రితం తన ఇంటికి వచ్చిన ఆయన ఆరోగ్యం బాగాలేదని తెలిసి అపోలో హాస్పిటల్ కు పంపించి అన్ని టెస్టులు చేయించానని.. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో వస్తారని అనుకున్న తనకి ఆయన మృతి చెందారన్న వార్త వినాల్సి రావడం బాధగా ఉంది. ఆయన కుటుంబానికి నా ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నా అని చిరంజీవి అన్నారు.Related Post

సినిమా స‌మీక్ష