ఐదేళ్ల ప్రేమ.. పెళ్ళెప్పుడు మరి..?

February 15, 2020


img

మాములుగా అయితే హీరో, హీరోయిన్ రీల్ లైఫ్ ప్రేమలనే కొనసాగిస్తూ రియల్ లైఫ్ లో కూడా లవ్ లో పడతారు. అయితే రియల్ లైఫ్ లో హీరోయిన్, డైరెక్టర్ లవ్ చాలా రేర్. విఘ్నేష్ శివన్, నయనతార విషయంలో అది జరుగుతుందని ప్రూవ్ అయ్యింది. శింబుతో లవ్ స్టోరీ నడిపించిన నయన్ అతని నుండి విడిపోయి ప్రభుదేవా లవ్ లో పడ్డది. ఆ తర్వాత అతని నుండి దూరమైన నయనతార సినిమాల్లో బిజీ అయ్యింది. 

నయన్ ప్రస్తుతం డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉంది. కొన్నాళ్ళు సీక్రెట్ గా నడిచిన వీరి వ్యవహారం అందరికి తెలిశాక ఓపెన్ అయ్యారు. వాలెంటైన్స్ డే సందర్బంగా విఘ్నేష్, నయన్ తమ పిక్స్ షేర్ చేస్తూ మా ప్రేమకు ఐదేళ్లు అంటూ మెసేజ్ పెట్టాడు. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట పెళ్లి ఆలోచన మాత్రం ఇప్పుడప్పుడే లేనట్టు ఉంది. మరి పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళు ఇలా ప్రేమికులుగా ఉంటారో చూడాలి.


Related Post

సినిమా స‌మీక్ష