నితిన్ వెడ్స్ శాలిని

February 14, 2020


img

యువ హీరో నితిన్ పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న నితిన్ ఏపిల్ 12న షాలిని పెళ్లాడబోతున్నాడు. రెండేళ్లుగా పరిచయం ఉన్న షాలినితో తన ప్రేమ విషయాన్ని చెప్పిన నితిన్ ఆమె ఒప్పుకోవడంతో పెళ్లికి సిద్ధమైనట్టు వెళ్లడించాడు. ఫిబ్రవరి 15న నితిన్, షాలిని ఎంగేజ్మెంట్ జరుగనుంది. వీరి పెళ్లి మాత్రం దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరుగనుందట.

ప్రస్తుతం నితిన్ భీష్మ సినిమా చేస్తున్నాడు. వెంకీ కుడుముల డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమాలో కూడా నటిస్తున్నాడు నితిన్. కొన్నాళ్లుగా నితిన్ పెళ్లిపై వార్తలు వస్తున్నా ఫైనల్ గా తనంతట తానే ఈ విషయం వెళ్లడించడంతో ఈ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడ్డది. Related Post

సినిమా స‌మీక్ష