సోలో బ్రతుకే సో బెటర్ థీమ్ వీడియో.. తేజూ అదరగొట్టాడుగా..!

February 14, 2020


img

మెగా మేనళ్లుడు సాయి తేజ్ హీరోగా నూతన దర్శకుడు సుబ్బు డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా సోలో బ్రతుకే సో బెటర్. బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబందించిన థీమ్ వీడియో ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. సోలోగా లైఫ్ లీడ్ చేసే హీరో తన ఫాలోవర్స్ కు ఇచ్చే ఓ మెసేజ్ తో ఈ వీడియో ఉంది.  

చిత్రలహరి ముందు వరకు హిట్ కోసం పోరాడిన సాయి తేజ్ ఆ సినిమా తర్వాత ప్రతిరోజూ పండుగే సినిమాతో కూడా హిట్ అందుకున్నాడు. చూస్తుంటే సోలో బ్రతుకే సో బెటరే సినిమాతో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు. సినిమా థీమ్ వీడియోలో సాయి తేజ్ లుక్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. సోలో బ్రతుకే సో బెటర్ సాయి తేజ్ కెరియర్ లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. 

      Related Post

సినిమా స‌మీక్ష