అల వైకుంఠపురములో రీమేక్ లో సల్మాన్..?

February 14, 2020


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం డైరక్షన్ లో వచ్చిన సినిమా అల వైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. నాన్ బాహుబలి రికార్డులను తుడిచిపెట్టిన ఈ సినిమాపై ఇతర భాషల దర్శక నిర్మాతల కళ్లు పడ్డాయి. ఈ సినిమా హింది రీమేక్ హక్కులను బాలీవుడ్ నిర్మాత అశ్విన్ 8 కోట్లకు కొన్నారు. కబీర్ సింగ్ సినిమా నిర్మించిన అశ్విన్ అల వైకుంఠపురములో సినిమా కనడంతో ఈ సినిమా బాలీవుడ్ రీమేక్ లో ఎవరు నటిస్తారా అన్న విషయంపై ఆసక్తి పెరిగింది.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా చూసిన సల్మాన్ ఖాన్ ఇంప్రెస్ అయ్యారట. అల వైకుంఠపురములో సినిమా హింది రీమేక్ లో సల్మాన్ ఖాన్ నటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. నిజంగానే సల్మాన్ ఖాన్ ఆ సినిమా చేస్తే అక్కడ కూడా అల వైకుంఠపురములో సినిమాకు సూపర్ బజ్ ఏర్పడే అవకాశం ఉంది. తెలుగులో సుపర్ హిట్టైన సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ చేయడం కామనే.. సల్మాన్ ఖాన్ కూడా ఇదివరకు పోకిరి రీమేక్ చేసి హిట్ కొట్టాడు. మరి బన్ని సినిమా రీమేక్ ఎలా ఉంటుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష