గీతా ఆర్ట్స్ లో మరోసారి..!

February 13, 2020


img

రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ శుక్రవారం రిలీజ్ కాబోతుంది. క్రాంతి మాధవ్ డైరక్షన్ లో తెరకెకిన ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, ఇజాబెల్లా హీరోయిన్స్ గా నటించారు. సినిమా టీజర్, ట్రైలర్ అర్జున్ రెడ్డిని తలపిస్తున్నా సినిమా చూశాక ఇది దానికి మించిన సినిమా అని తప్పకుండా అంటారని చిత్రయూనిట్ చెబుతున్నారు. ఇక ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత పూరి డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. 

ఆ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఆ సినిమా తర్వాత మరోసారి గీతా ఆర్ట్స్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. విజయ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గీతా గోవిందం గీతా ఆర్ట్స్ లోనే తెరకెక్కింది. ఆ తర్వాత వచ్చిన టాక్సీవాలా సినిమాకు గీతా ఆర్ట్స్ సహనిర్మాతగా వ్యవహరించారు. ఈ రెండు సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్ అందుకున్న విజయ్ హ్యాట్రిక్ మూవీతో కూడా సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి. అయితే విజయ్ తో గీతా ఆర్ట్స్ చేసే సినిమాకు దర్శకుడు ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదట.Related Post

సినిమా స‌మీక్ష