చరణ్ బర్త్ డేకి అల్లూరి లుక్

February 12, 2020


img

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న RRR. తారక్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అసలైతే ఈ ఇయర్ జూలై 30న  రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా రిలీజ్ వాయిదా వేశారు.  లేటెస్ట్ గా 2021 జనవరి 8న ఆర్.ఆర్. ఆర్ రిలీజ్ ఫిక్స్ చేశారు. 

ఈ సినిమా కు సంబందించిన టైటిల్ పోస్టర్ అది కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రిలీజ్ చేసింది తప్ప ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. చరణ్, తారక్ ల ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఫెస్టివల్ సీజన్ల కోసం ఎదురుచూడటం..  ఎలాంటి అప్డేట్ లేక నిరాశ చెందడం కామన్ అయ్యింది. అయితే మార్చ్ 27న మెగా ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇస్తున్నారట. చరణ్ బర్త్ డే నాడు RRR నుండి అల్లూరి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని టాక్. 

మే 20న తారక్ బర్త్ డే సందర్బంగా కొమరం భీమ్ లుక్ రిలీజ్ చేస్తారట. మరి ఈసారైనా ఈ అప్డేట్స్ ఇస్తారా లేక ఇది కూడా మిస్ చేస్తారా అన్నది చూడాలి. 


Related Post

సినిమా స‌మీక్ష