రేణు దేశాయ్ తో పవన్ మళ్ళీ కలుస్తారా..?

February 12, 2020


img

పవన్ తన మాజీ భార్య రేణు దేశాయ్ తో కలిసి సినిమా చేస్తున్నాడు అంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. పింక్ రీమేక్ గా పవన్ చేస్తున్న సినిమాలో రేణు దేశాయ్ కూడా ఉంటుందని అంటున్నారు. పవన్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ ఒంటరిగానే ఉంటున్నారు. ఈమధ్యనే మళ్ళీ సినిమాల్లో బిజీ అవనున్న రేణు దేశాయ్ పవన్ సినిమాలో నటింపచేయాలని చూస్తున్నాడట నిర్మాత దిల్ రాజు.

పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వకీల్ సాబ్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. మరి పవన్ తో రేణు కలిసి సినిమా చేస్తారా లేదా అన్నది చూడాలి.


Related Post

సినిమా స‌మీక్ష