నితిన్ పెళ్లాడేది ఎవరినంటే..!

February 12, 2020


img

యువ హీరో నితిన్ పెళ్లి గురించి కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. హీరోగా నితిన్ తన సత్తా చాటుతుండగా ప్రస్తుతం భీష్మ సినిమాతో ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నితిన్. ఇక పెళ్లి వార్తలను నిజం చేస్తూ నితిన్ కాబోయే భార్య పేరు ఆమె వివరాలు బయటకు వచ్చాయి.  నితిన్ షాలిని అనే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడట.  ఫిబ్రవరి 15న నితిన్ షాలినిల ఎంగేజ్మెంట్ జరుగనున్నదట. 

ఏప్రిల్ లోనే వీరి పెళ్లి జరుగుతుందని తెలుస్తుంది. మాస్టర్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తున్న షాలినితో నితిన్ వివాహం జరుగనుంది. ఇక సినిమాల విషయానికి వస్తే భీష్మ తర్వాత వెంకీ అట్లూరి డైరెక్షన్ లో రంగ్ దే సినిమా లైన్ లో పెట్టాడు నితిన్. ఆ సినిమాతో పాటుగా చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో మూవీ చేస్తున్నాడు.


Related Post

సినిమా స‌మీక్ష