త్రివిక్రమ్ తారక్ మూవీ పొలిటికల్ టచ్

February 11, 2020


img

అల వైకుంఠపురములో సినిమా సక్సెస్ తర్వాత త్రివిక్రమ్ తన నెక్స్ట్ సినిమా తారక్ తో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఆల్రెడీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో అరవింద సమెత సినిమా చేశారు. ఆ సినిమా సక్సెస్ అవడంతో మరోసారి ఈ కాంబో మూవీపై అంచనాలు పెరిగాయి. 

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా కథకు పొలిటికల్ టచ్ ఉంటుందని తెలుస్తుంది. ఒక పొలిటీషియన్ కొడుకుగా తారక్ కనిపిస్తాడట. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చిన తారక్ ఫస్ట్ టైం పొలిటికల్ సబ్జెక్ట్ తో ఈ సినిమా చేస్తున్నాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. 


Related Post

సినిమా స‌మీక్ష