దిల్ రాజుకి రెండో పెళ్ళా..?

February 10, 2020


img

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో పెళ్లికి సిద్ధమావుతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. స్టార్ ప్రొడ్యూసర్ గానే కాదు డిస్ట్రిబ్యూటర్ గా కూడా దిల్ రాజు  చాలా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు ఈమధ్యనే తన భార్య అనితని కోల్పోయారు. 

ఆ తర్వాత సినిమాలతో బిజీగా మారిన దిల్ రాజు ఒంటరి అనే భావన కలగలేదు. తను నిర్మించే సినిమా షూటింగ్స్ లోనే 365 రోజులు గడిపే దిల్ రాజు ఇంటి దగ్గర ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. తన కూతురు కూడా పెళ్ళై అత్తారింటికి వెళ్ళింది. అందుకే దిల్ రాజు మళ్ళీ పెళ్లికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. సినిమా పరిశ్రమకు ఏమాత్రం సంబంధం లేని ఒక బ్రాహ్మణ అమ్మాయిని దిల్ రాజు పెళ్ళాడుతున్నాడని టాక్. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

ఇక సినిమాల విషయానికి వస్తే దిల్ రాజు 17 ఏళ్ల కెరియర్ లో మొదటిసారి రీమేక్ చేసిన సినిమా జాను. లాస్ట్ ఫ్రై డే రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది.


Related Post

సినిమా స‌మీక్ష