చిరు 152లో సమంత..?

February 10, 2020


img

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ తో పాటుగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తారని తెలుస్తుండగా సినిమాలో హీరోయిన్ గా త్రిషని ఫైనల్ చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్. 

ఇదిలాఉంటే ఈ సినిమాలో సమంత కూడా మరో హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. సినిమాలో చిరు యంగ్ రోల్ లో చరణ్ నటిస్తున్నాడని అంటున్నారు. అయితే చిరుకి జోడీగా త్రిష చరణ్ కు జతగా సమంతని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. పెళ్లి తర్వాత కూడా కెరియర్ ఫుల్ ఫామ్ కొనసాగిస్తున్న సమంత మెగా సినిమాలో ఉందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. 

ఈ సినిమా కోసం కోకాపేటలో భారీ సెట్ వేశారట. రెండు నెలలు పాటు అక్కడే షూటింగ్ చేస్తారట. రంగస్థలం సెట్ లో కూడా ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది.


Related Post

సినిమా స‌మీక్ష