రాం చరణ్ మంచి మనసు

February 10, 2020


img

టాలీవుడ్ లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి అండ్ ఫ్యామిలీ తమ కోసం ఎన్నో సేవలను చేస్తున్న మెగా ఫ్యాన్స్ కు ఎప్పుడూ మంచి చేస్తుందని తెలుస్తుంది. రీసెంట్ గా మెగా ఫ్యాన్స్ అందరికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఏర్పాటు చేసేలా చర్చలు జరుగుతున్నాయట. ఈమధ్యనే మెగా అభిమని నూర్ మహ్మద్ మృతి చెందిన విషయం తెలిసిందే. మెగా అభిమానిగా చిరు పేరు మీద ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు నూర్ మహ్మద్. ఆయన మరణించిన సమయంలో చిరు కూడా నూర్ మహ్మద్ ఇంటికి వెళ్లి ఆయన భౌతిక ఖాయానికి నివాళులు అర్పించారు.

అప్పుడు షూటింగ్ లో ఉన్న రాం చరణ్ ఆ తర్వాత నూత్ మహ్మద్ ఫ్యామిలీని కలుసుకోవడం జరిగింది. అప్పుడే నూర్ మహ్మద్ ఫ్యామిలీకి అండగా తాను ఉంటానని.. వారి కుటుంబానికి 10 లక్షల సాయం చేస్తానని ప్రకటించారు రాం చరణ్. చెప్పినట్టుగానే నూర్ మహ్మద్ ఫ్యామిలీకి 10 లక్షల చెక్ అందించారు చరణ్. అంతేకాదు ఆ ఇంటికి పెద్ద కొడుకుగా నూర్ మహ్మద్ కొడుకుని మంచి ఉద్యోగం.. మహ్మద్ కూతుళ్లకు దగ్గర ఉండి పెళ్లి జరిపిస్తారని హామి ఇచ్చారు చరణ్. చరణ్ మంచి మనసుకి నూర్ మహ్మద్ ఫ్యామిలీ ఎంతో సంతోషించారు. చరణ్ మంచి మనసుకి ప్రతి మెగా ఫ్యాన్ గర్వపడుతున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష