రాజమౌళి వర్సెస్ శంకర్..!

February 10, 2020


img

సౌత్ లో స్టార్ డైరక్టర్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్న రాజమౌళి శంకర్ లు తమ సినిమాలతో ఎప్పుడూ ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ కు గురి చేస్తారు. వీరిద్దరి సినిమాలకు ఆడియెన్స్ ఎన్ని అంచనాలతో వచ్చినా ఆ అంచనాలను మించి సినిమా ఉండేలా చేస్తారు. అందుకే వారిద్దరికి ప్రత్యేక స్థానం ఉంది. శంకర్ ఎప్పటినుండో తన మార్క్ సినిమాలతో అలరిస్తుండగా రాజమౌళి కూడా బాహుబలితో ఒక్కసారిగా వరల్డ్ ఫేమస్ డైరక్టర్ గా మారాడు. ఇదిలాఉంటే ఈ ఇద్దరు దర్శకుల సినిమాలు ఇప్పుడు క్లాష్ అవుతున్నాయని తెలుస్తుంది.

బాహుబలి తర్వాత రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటించడం సినిమాపై తారాస్థాయి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ఇయర్ జూలై 30న రిలీజ్ అనుకున్న ఈ సినిమా కాస్త 2021 జనవరి 8కి వాయిదా వేశారు. ఇక అదే టైం కు శంకర్, కమల్ హాసన్ కాంబోలో వస్తున్న ఇండియన్ 2 సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. రాజమౌళి సినిమా అంటే వేరే తెలుగు సినిమా ఏది పోటీకి రాదు. కాని తమిళ సినిమా అదికూడా సూపర్ హిట్ మూవీకి సీక్వల్ గా వస్తున్న ఇండియన్ 2 మాత్రం పోటీకి సిద్ధమైంది. మరి రాజమౌళి, శంకర్ పోటీపడుతుండగా ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష