జాను నెగటివ్ యాంగిల్.. చూడగలమా..?

February 10, 2020


img

సౌత్ లో ఎంతమంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా సమంత మాత్రం చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఏమాయ చేసావే సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన జాను వరకు సమంత సినిమా అంటే సంథింగ్ స్పెషల్ అన్నట్టే. ఇక జానుగా మరోసారి ప్రేక్షకుల హృదయాలను తెలిచింది సమంత. 96 రీమేక్ గా వచ్చిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. శర్వానంద్, సమంతల జోడీ సినిమాకు ఎట్రాక్షన్ గా మారింది. ఇక జానుగా సమంత నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే మొదటి సినిమా నుండి జాను వరకు సాఫ్ట్ క్యారక్టర్ లో కనిపించిన సమంత కెరియర్ లో మొదటిసారి నెగటివ్ రోల్ చేస్తుంది.

అమేజాన్ ప్రైం వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్ పార్ట్ 2లో సమంత పూర్తిస్థాయిలో నెగటివ్ రోల్ చేస్తుందట. సమంత పాత్రే ఆ వెబ్ సీరీస్ కు హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇన్నాళ్లు హీరోయిన్ గా సాఫ్ట్ క్యారక్టర్స్ లో మెప్పించిన సమంతని అలా ఒకేసారి నెగటివ్ రోల్ లో చూసి ఆడియెన్స్ కన్విన్స్ అవుతారా లేదా అన్నది చూడాలి. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఆ వెబ్ సీరీస్ గురించి చెబుతూ సమంత మరింత ఎక్సయిటింగ్ పెంచుతుంది.


Related Post

సినిమా స‌మీక్ష