400 కోట్ల బడ్జెట్ తో RRR.. ఆ హీరోకి నో పేమెంట్.. వాట్ ఈజ్ దిస్..!

February 07, 2020


img

ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ సినిమాలో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆయన పాత్ర చిన్నదే అని తెలుస్తుంది. అందుకే ఆ పాత్ర కోసం నటిస్తున్నదుకు ఆయన ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా పనిచేస్తున్నారని అంటున్నారు. అదేంటి 400 కోట్ల బడ్జెట్ తో అజయ్ దేవగన్ కు ఇవ్వడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని అనుకోవచ్చు.. నిర్మాత దానయ్య, డైరక్టర్ రాజమౌళి ఆయన అడిగినంత ఇచ్చేందుకు రెడీ అంటున్నా అజయ్ దేవగన్ మాత్రం అందుకు ఒప్పుకోలేదట.

రాజమౌళి ఈగ సినిమాకు హింది డబ్బింగ్ చెప్పారు అజయ్ దేవగన్. ఆర్.ఆర్.ఆర్ లో అజయ్ దేవగన్ ఉంటున్నారన్న విషయం ప్రకటించిన టైంలోనే.. ఎనిమిదేళ్లుగా రాజమౌళితో పరిచయం ఉంది.. మేమంతా కలిసి పనిచేస్తున్నాం.. ఆర్.ఆర్.ఆర్ కోసం ఆయనతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా అంటూ అజయ్ ట్వీట్ చేశారు. ఒక బాలీవుడ్ స్టార్ హీరో తెలుగు దర్శకుడు తెలుగు సినిమాకు ఈమాత్రం గౌరవం ఇవ్వడం చూస్తే నిజంగా అజయ్ మనసు ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు.Related Post

సినిమా స‌మీక్ష