సైరా అక్కడ డిజాస్టర్..!

January 24, 2020


img

మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ అయిన సైరా నరసిం హా రెడ్డి సినిమా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కిన విషయం తెలిసిందే. 2019 అక్టోబర్ 2న రిలీజైన ఈ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. 150 ఏళ్ల క్రితం జరిగిన మొదటి స్వాతంత్ర పోరాట యొధుడి చరిత్రగా ఉయ్యాలవాడ నరసిం హా రెడ్డి జీవిత కథతో సైరా సినిమా తెరక్కెకింది. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మించారు.

సినిమాలో చిరు పర్ఫార్మెన్స్ అందరిని మెప్పించింది. కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ అందుకోగా స్మాల్ స్క్రీన్ పై మాత్రం ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. జెమిని టివిలో సంక్రాంతి కానుకగా ప్రసారమైన సైరా నరసిం హా రెడ్డి సినిమా అత్యల్పంగా 11.9 టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకుంది. స్టార్ హీరోల సినిమాలు రిపీట్ అయినా కూడా 10 నుండి 15 మధ్యలో రేటింగ్ వస్తుంది. అలాంటిది సైరా సినిమా కేవలం 11.9 రేటింగ్ వచ్చి షాక్ ఇచ్చింది. ఆల్రెడీ అమేజాన్ ప్రైం లో ఈ సినిమా చూడటం.. పండుగ టైం లో మహేష్, బన్ని సినిమాలు రిలీజ్ అవడం వల్ల స్మాల్ స్క్రీన్ పై ఈ సినిమా ఎవరు చూడలేదని తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష