అల...ఓవర్సీస్‌లో....

January 21, 2020


img

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా నటించిన ‘అల వైకుంఠపురంలో...’ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో నేటికీ భారీగా కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడ్డంతో ఈ సినిమా అల్లు అర్జున్ సినీ కెరీర్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పబోతోంది. దేశంలోనే కాక విదేశాలలో సైతం ఈ సినిమాకు చాలా బారీగా కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. 

భరత్ అనే నేను ఓవర్సీస్‌లో 3.4 మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించి బాహుబలి రికార్డులను బీట్ చేయగా 3.5 మిలియన్ డాలర్లతో రంగస్థలం భరత్‌ను బీట్ చేసింది. ఇప్పుడు అల వైకుంఠపురం దానిని బీట్ చేయబోతోంది. విడుదలైన 10 రోజులలోపే మిలియన్ డాలర్ల కలక్షన్లతో దూసుకుపోతుండటంతో త్వరలోనే అలవోకగా వైకుంఠపురం...రంగస్థలం రికార్డును బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు సినిమాలు అంతర్జాతీయస్థాయిలో హిందీ ఇంగ్లీష్ సినిమాలకు పోటీగా ఇంత గొప్పగా బిజినెస్ చేస్తుండటం విశేషమే కదా! Related Post

సినిమా స‌మీక్ష